పొడుపు కథలు
- చింకిరి చింకిరి గుడ్డలు రత్నాల్లాంటి బిడ్డలు - మొక్కజొన్న
- చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తియ్యగానున్దు - టెంకాయ
- పోద్దివాడికి పుట్టెడు అంగీలు - ఉల్లిగడ్డ
- అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మంచి రోజు చూసి పంచన చేరింది - మంచం
- అక్కా చెల్లెల అనుభంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గర దగ్గర ఉన్నారు కాని దరికి చేరలేకున్నారు - కళ్ళు
- కిట కిట తలుపులు, కిటారు తలుపులు, ఎప్పుడు తెరచిన చప్పుడు కావు - కళ్ళు
- ఎండకు ఏండి, వానకు తడిసి, మూల నక్కి కూచుంది - గొడుగు
- పళ్ళున్న నోరు లేనిది - దువ్వెన
- ఎంత దానం చేసినా తరగనిది, అంతకంతకు పెరిగేది - చదువు / విద్య
- నామముంది కాని పూజారిని కాను, వాలముంది కాని కోతిని కాను - ఉడుత
- నాలుగు కళ్ళున్నాయి కాని జంతువూ కాదు, రెండు చేతులున్నాయి కాని మనిషి కాదు - కుర్చి
No comments:
Post a Comment