వారాల పాట - ఆదివారం నాడు అమ్మాయి పుట్టింది
ఆదివారం నాడు అమ్మాయి పుట్టింది
సోమవారం నాడు సొంపుగా పెరిగింది
మంగళవారం నాడు మాటలే పలికింది
బుధవారం నాడు బుద్దులే నేర్చింది
గురువారం నాడు గురువుదరి చేరింది
శుక్రవారం నాడు శుభమంటు రాసింది
శనివారం నాడు చక చకా నడిచింది
అది చూసి మేమంత ఆనందపడ్డాము.
No comments:
Post a Comment